వరి, మొక్కజొన్న వంటి పంటలలో కలుపు నివారణకు ఉపయోగించే పారాక్వాట్ డీక్లోరైడ్ 24 శాతం ఎస్ఎల్ గడ్డిమందు ఉత్పత్తి, అమ్మకాలు, నిల్వలు, పంపిణీపై నిషేధం విధించినట్లు ఏవో వై సూర్యకుమారి తెలిపారు. మంగళవారం నరసన్నపేట మండలంలో ఏడు ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన ఆమె, ఈ తనిఖీలలో భాగంగా 1200 లీటర్ల గడ్డిమందు అమ్మకాలను నిలిపివేస్తూ నోటీసులు జారీ చేశామని, నిషేధాన్ని తప్పక అమలు చేయాలని ఆదేశించారు.