నరసన్నపేట మండలం దేవాది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో పారిశుధ్య పనులు, పిచ్చి మొక్కల తొలగింపు కార్యక్రమాలు చేపట్టారు. పాఠశాల ఆవరణ పెద్దదిగా ఉండటంతో పాటు పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగిపోయాయని హెచ్ఎం వీర్రాజు తెలిపారు. వీటిని తొలగించేందుకు ఉపాధి హామీ అధికారుల సహాయంతో పనులు చేపట్టి, పాఠశాలను పరిశుభ్రం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.