నరసన్నపేట: సబ్ జైలును సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జి

నరసన్నపేట లో ఉన్న సబ్ జైలును జిల్లా న్యాయ అధికార సేవా సంస్థ కార్యదర్శి కే హరిబాబు సందర్శించారు. సోమవారం సాయంత్రం సబ్ జైలుకు చేరుకున్న ఆయన ముద్దాయిలతో మాట్లాడుతూ ఆహార మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. అలాగే ముద్దాయిలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని వివరించారు. అనంతరం వంటశాల, నిత్యవసర సరుకులు జైలు ప్రాంగణాన్ని పరిశీలించారు. నరసన్నపేట సివిల్ జడ్జ్ ఎస్ వాణి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్