నరసన్నపేట మండలం రావుల వలస గ్రామానికి చెందిన పైల సుందర్ రావు ఇటీవల విడుదలైన గ్రూప్ వన్ ఫలితాలలో డీఎస్పీగా ఎంపికయ్యారు. శనివారం రాత్రి విజయవాడ నుండి లోకల్ యాప్ న్యూస్ తో మాట్లాడుతూ, యువత ఏదైనా లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఒక ప్రణాళికతో పద్ధతిగా సిద్ధం కావాలని సూచించారు. ఆయన త్వరలో సివిల్స్ కు కూడా సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ విజయం ఆయనకు, ఆయన గ్రామానికి గర్వకారణమైంది.