నరసన్నపేట: ఎన్టీఆర్ గృహ నిర్మాణాలు వేగవంతం చేయండి.. పిడి

గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ రమాకాంత్, ఉగాది నాటికి ఎన్టీఆర్ గృహ నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం నరసన్నపేట మండలం గడ్డియ్య పేట కాలనీలో గృహ నిర్మాణాలను పరిశీలించిన ఆయన, జిల్లాలో ఐదు లక్షల ఇళ్లు లక్ష్యంగా చేసుకున్నామని, త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసే దిశగా లబ్ధిదారులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, హౌసింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్