ప్రభుత్వ ఆదేశాల మేరకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని వేగవంతం చేయాలని తహసిల్దార్ టి సత్యనారాయణ తెలిపారు. శనివారం నరసన్నపేట మండలం యారబాడు, ఉర్లాం, కంబకాయ, కరగాం రెవెన్యూ గ్రామాలలో పర్యటించిన ఆయన, పంచాయతీ, రెవెన్యూ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించామని, ఈరోజు శత శాతం పంపిణీ జరగాలని సూచించారు. రెవెన్యూ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.