నరసన్నపేట: బోర్డు బంగ్లా పై కన్నేసిన శ్రీకాకుళం టిడిపి నేత

నరసన్నపేట పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న బోర్డు బంగ్లా స్థలాన్ని కబ్జా చేసేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఎంపీపీ ఆరంగి మురళీధర్ ఆరోపించారు. శనివారం నరసన్నపేట వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, తమ హయాంలో ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నామని, ఇప్పుడు శ్రీకాకుళంకు చెందిన టీడీపీ నేత దీనిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

సంబంధిత పోస్ట్