నరసన్నపేట: జిల్లా పోటీలలో సత్తా చాటిన విద్యార్థినిలు

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి క్రీడా పోటీలలో నరసన్నపేట పిఎం శ్రీ ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. బుధవారం పాఠశాల హెచ్ఎం పైడి వెంకటరావు మాట్లాడుతూ, వాలీబాల్ లో ప్రథమ, బ్యాట్మింటన్ లో ద్వితీయ, జావలిన్, డిస్క్ త్రో లో తృతీయ స్థానాలు సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు క్రీడాకారులను అభినందించారు.

సంబంధిత పోస్ట్