నరసన్నపేట: భద్రత భరోసా పింఛన్లు సద్వినియోగం చేసుకోండి

శనివారం నరసన్నపేట మండలం హడ్కో కాలనీలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అర్హులైన లబ్ధిదారులకు నేరుగా ఎన్టీఆర్ భద్రత పింఛన్లు అందజేశారు. కూటమి ప్రభుత్వం ప్రతి నెల అర్హత పొందిన లబ్ధిదారులకు అందజేస్తున్న ఈ పింఛన్లను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ నెలలో పింఛన్లు ఒక రోజు ముందుగానే అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్