నరసన్నపేట: గొట్టిపల్లిలో కాలువలు ఇలా.. మురుగు కదిలేది ఎలా..?

నరసన్నపేట మండలం గొట్టిపల్లి పంచాయితీలో మురుగు కాలువలు శుభ్రం చేయకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువలు మట్టి, మొక్కలతో నిండిపోయి మురుగునీరు నిలిచిపోవడంతో దోమలు, దుర్వాసనతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు వెంటనే దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్