సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. సోమవారం నరసన్నపేట పట్టణంలోని బండి వీధి, సెగిడి వీధిలతోపాటు తదితర వీధిలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యం కేవలం సంక్షేమం నిరుపేదలకు అందించడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించడం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.