ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎంఈఓ 1 ఉప్పాడ శాంతారావు తెలిపారు. గురువారం నరసన్నపేట మండలం లకిమేర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలో తల్లిదండ్రులను కలిసి తమ పిల్లలను పాఠశాలలో చేర్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే బోధన సామర్థ్యాలను మరింత పెంపు చేయాలంటూ సూచించారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.