నరసన్నపేట: ఓటరు గణన బాధ్యత బి ఎల్ ఓలదే.. ఎన్నికల అధికారి

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటరు గణనను బాధ్యతగా చేపట్టాలని బీఎల్‌వోలకు ఎన్నికల అధికారి బి. జయదేవి సూచించారు. శుక్రవారం నరసన్నపేట మండల పరిషత్ సమావేశ మందిరంలో పోలాకి, నరసన్నపేట మండలాల బీఎల్‌వోలతో నిర్వహించిన సమావేశంలో ఆమె ఈ మేరకు తెలిపారు. ఈ ప్రక్రియ ఈ నెల 15వ తేదీ నుండి ప్రారంభమై వచ్చే నెల 14వ తేదీతో ముగుస్తుందని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సిబ్బందితో పాటు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్