కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలంటూ ఎన్నికలలో ప్రచారం చేసుకుని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పథకాలను జీరో చేశారని ఎంపీపీ ఆరంగి మురళీధర్ అన్నారు. శుక్రవారం నరసన్నపేట మండలం యారబాడు, వి ఎం పురం, కోమార్తి, దేవాది పంచాయతీలలో బాబు షూరిటీ. మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని స్థానిక నాయకులతో కలిసి నిర్వహించారు. ఆడబిడ్డ పథకం, నిరుద్యోగ భృతి తో పాటు పలు పథకాలు 15 నెలలు గడిచిన అమలు చేయలేదని ఎద్దేవా చేశారు.