ఈటీవీ, డీ జోడి వంటి పలు ఛానళ్లలో గుర్తింపు పొందిన పండు, నరసన్నపేటలో శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన డాన్స్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. తన అసలు పేరు షణ్ముఖ అని, శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం నౌపడ గ్రామానికి చెందినవాడినని తెలిపారు. స్వతంత్రంగా డాన్స్ నేర్చుకున్నానని, ఈ రంగంలో మరింత రాణిస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.