ప్రముఖ మెజీషియన్, వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ బి.వి పట్టాభిరామ్ మృతి బాధాకరమని శ్రీకాకుళం మెజీషియన్ సంఘ సభ్యులు అన్నారు. శనివారం నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక జీసీ హోమ్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాలింగ కార్పొరేషన్ చైర్మన్ రోనంకి కృష్ణమ నాయుడు, మెజీషియన్ సంఘ సభ్యులు శ్రీనివాస పండిట్, ఉమామహేశ్వరరావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.