నరసన్నపేట పట్టణంలో మద్యం సేవించి ద్విచక్ర వాహనాలు నడుపుతున్న ఎం వెంకటేష్, నరసింహమూర్తి అనే ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. ఇటీవల జరిగిన తనిఖీలలో వీరిని గుర్తించారు. మంగళవారం నరసన్నపేట మెజిస్ట్రేట్ కార్యాలయంలో విచారణ చేపట్టగా, జూనియర్ సివిల్ జడ్జి ఎస్ వాణి ఒక్కొక్కరికి 2,500 రూపాయల జరిమానా విధించారు. ఈ వివరాలను సీఐ ఎం శ్రీనివాసరావు తెలిపారు.