కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి రెండేళ్లు పూర్తయినా ప్రజలకు తీరని వంచన చేస్తోందని వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. బుధవారం నరసన్నపేట వైసీపీ కార్యాలయంలో దీనికి నిరసనగా 'వెన్నుపోటుకు రెండేళ్లు' పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ పోరాటాన్ని ఈ నెల 12 వరకు మండలాలు, నియోజకవర్గాలలో కొనసాగిస్తామని, ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.