నరసన్నపేట: పోలీసుల సమక్షంలో రైతులకు యూరియా పంపిణీ

నరసన్నపేట మండలం కరగాం రైతు సేవా కేంద్రాల్లో మంగళవారం యూరియా పంపిణీలో రగడ జరగడంతో పంపిణీ నిలిపివేశారు. బుధవారం పోలీసుల సమక్షంలో ఎస్సైలు బి. గణేష్, శేఖర్ రావు ఆధ్వర్యంలో పంపిణీ ప్రక్రియను కొనసాగించారు. ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క బస్తా యూరియాను ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందజేశామని, మండలంలో యూరియా కొరత లేదని ఏవో వై. సూర్య కుమారి తెలిపారు.

సంబంధిత పోస్ట్