నరసన్నపేట: పశువులను అక్రమంగా తరలిస్తున్న వాహనం స్వాధీనం

నరసన్నపేట మండలం మడపాం టోల్గేట్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని ఎస్సై సిహెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఒడిస్సా నుండి విశాఖపట్నం కు 18 దున్నపోతులు రవాణా అవుతుండడంతో సాధారణ తనిఖీలలో భాగంగా టోల్గేట్ వద్ద వాహనాన్ని తనిఖీ చేసామన్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని పశువులను కొత్తవలస గోసాల కు తరలించామని వివరించారు.

సంబంధిత పోస్ట్