నరసన్నపేట: గంజాయి బ్యాచ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు

నరసన్నపేట లో సోమవారం రాత్రి జరిగిన గంజాయి బ్యాచ్ దాడి పట్ల స్థానిక పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బాధితులు ఇన్చార్జి ఎస్ఐ పి అశోక్ బాబుకు జరిగిన సంఘటనపై వివరంగా తెలియజేశారు. విచక్షణ రహితంగా తమపై దాడి చేయడమే కాకుండా తమ షాపును కూడా ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుల వివరాలను కూడా అందజేశారు. కేసు నమోదు చేస్తామని ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్