నరసన్నపేట: విద్యుదాఘాతంతో మహిళ మృతి

నరసన్నపేట మండలం జగ్గునాయుడుపేట గ్రామంలో శనివారం నక్క నాగమ్మ (60) అనే మహిళ విద్యుదాఘాతంతో మృతి చెందారు. పొలాల్లో గడ్డి కోసి ఇంటికి వస్తున్న క్రమంలో తెగిపడి ఉన్న విద్యుత్ తీగను తొలకడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. సాయంత్రం పొలాలకు వచ్చిన స్థానికులు ఆమె మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులకు ఇంకా ఫిర్యాదు అందలేదని ఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్