నరసన్నపేట న్యాయస్థాన పరిధిలోని పెండింగ్ కేసులు మధ్యవర్తిత్వంతోనే రాజీ చేసేందుకు న్యాయవాదులు కృషి చేయాలని జూనియర్ సివిల్ జడ్జి ఎస్ రాణి తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక న్యాయవాదులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన మెగా లో అదాలత్ లో ఎక్కువగా కేసులను పరిష్కరించడం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.