నరసన్నపేట మండలం తామరపల్లి గ్రామానికి చెందిన కోల చక్రవర్తి (30), వృత్తిరీత్యా డ్రైవర్, కిడ్నీ వ్యాధితో బాధపడుతూ శ్రీకాకుళంలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. గత మూడేళ్లుగా నరసన్నపేట సిఐ వాహన డ్రైవర్‌గా పనిచేస్తున్న ఆయనకు, ఇటీవల కిడ్నీ వ్యాధి బయటపడడంతో పోలీస్ శాఖ వైద్య ఖర్చులకు సహకరించింది. అయినప్పటికీ, చికిత్స ఫలించక తుదిశ్వాస విడిచారు.