నరసన్నపేట పోలీస్ స్టేషన్ మహిళా పోలీసులు యశోద, ద్రాక్షాయిని సోమవారం నరసన్నపేట మండల కేంద్రంలోని ఒక ప్రైవేటు డిగ్రీ కళాశాలలో నారి శక్తి కార్యక్రమంలో భాగంగా యువతకు మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించారు. నేడు విచ్చలవిడిగా మాదకద్రవ్యాల వినియోగం పెరుగుతుందని, యువత వాటికి దూరంగా ఉండాలని సూచించారు. అలాగే, సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, సెల్ఫోన్ వినియోగించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.