ఎన్నికలలో హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు ఏడాది గడిచిన అమలు చేయలేకపోయారని ఎంపీపీ ఆరంగి మురళీధర్ విమర్శించారు. గురువారం ఉదయం నరసన్నపేట మండలం దూకులపాడు పంచాయతీలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆడబిడ్డ నిధి పథకం, నిరుద్యోగ భృతి వంటి హామీలు నెరవేర్చలేకపోయారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.