పలాస మండలం సున్నాడ గ్రామం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు గాయపడ్డాడు. సైకిల్‌పై వెళుతున్న అతన్ని ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే స్పందించి, గాయపడిన యువకుడిని పలాస ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అతన్ని జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు సిబ్బంది తెలిపారు.