ఆదివారం సాయంత్రం పోలాకి మండలంలోని చిన్న కోవిరిపేట గ్రామ సమీపంలో ఒక తోటలో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు ఎస్సై జి రంజిత్ తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురిని అదుపులోకి తీసుకుని, 4620 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడితే కేసులు తప్పవని ఎస్సై హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.