పోలాకి: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు.. ఒకరికి తీవ్ర గాయాలు

పోలాకి మండలం సుసరాం గ్రామ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఉరజాం గ్రామానికి చెందిన సంపతి రావు వైకుంఠ రావు ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళుతుండగా, వెనుక నుండి వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వైకుంఠ రావును నరసన్నపేట ఏరియా హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై జి రంజిత్ తెలిపారు.

సంబంధిత పోస్ట్