పోలాకి మండలం మబగాం జడ్పీ పాఠశాలలో నిర్వహిస్తున్న మెగా పిటిఎం సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా గురువులను పూజించుకునే గురు పౌర్ణమి రోజున ఈ సమావేశం ప్రభుత్వం నిర్వహించడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పెద్దలను గౌరవించు కోవాలన్న సాంస్కృతిని కొనసాగించాలని సూచించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.