పోలాకి మండలం మబగాం పంచాయతీ కత్తిరివాని పేట గ్రామంలో శుక్రవారం ఉదయం, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బగ్గు అర్చన, ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో కలిసి ఎన్టీఆర్ భద్రతా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పేదల సేవలో నిరుపేదలకు భద్రతా పింఛన్లు అందిస్తోందని, స్పౌజ్ పెన్షన్లు కూడా పంపిణీ చేస్తున్నామని తెలిపారు.