పోలాకిలో సోమవారం రాత్రి జరిగిన జాతర సందర్భంగా 'డ్రగ్స్ వద్దు' కార్యక్రమం నిర్వహించారు. ఈగల్ సెల్ సభ్యుడు కే రామచంద్రన్ మాట్లాడుతూ, డ్రగ్స్ వినియోగం లేదా అమ్మకాలపై సమాచారం ఉంటే 1972కు ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు. ఎస్సై రంజిత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.