పోలాకి: రెండవ విడత పాఠ్యపుస్తకాలు రాక

పోలాకి మండల కేంద్రానికి రెండవ విడత పార్టీ పుస్తకాలు చేరాయని ఎంఈఓ ఎస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం ఎమ్మార్సీ కార్యాలయంలో ఈ పుస్తకాలను భద్రపరిచారు. మొదటి విడతలో 17400 పాఠ్యపుస్తకాలు వచ్చాయని, పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు. నోటు పుస్తకాల పంపిణీ కూడా చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్