పోలాకి మండలం దీర్ఘాసి గ్రామంలోని శ్రీ నీలకంటేశ్వర స్వామి ఆలయంలో శని త్రయోదశి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శనివారం తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని శనీశ్వరుని పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు భక్తుల స్నానాల కోసం తగిన ఏర్పాట్లు చేశామని, ఈ పూజలు మధ్యాహ్నం వరకు కొనసాగుతాయని తెలిపారు.