పోలాకి: గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు సద్వినియోగం చేసుకోండి

రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ డైరెక్టర్ రాజగోపాల్ తెలిపారు. శనివారం పోలాకి మండలం ప్రియాగ్రహారం పశు వైద్య కేంద్ర ఆధ్వర్యంలో పాలవలస గ్రామంలో నిర్వహిస్తున్న శిబిరాన్ని ఆయన పరిశీలించారు. ఈ టీకాలు వేయించడం వలన పాడి పశువులకు వ్యాధి నిరోధక శక్తి కలుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి షణ్ముఖరావు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్