రాష్ట్రంలో నిరుపేదలు ఇబ్బందులకు గురవుతున్నారని ముఖ్యంగా వృద్ధులు, వితంతువులకు ఆదుకునేందుకు మొదటిసారిగా పింఛన్లను టీడీపీ హయాంలో స్వర్గీయ ఎన్టీ రామారావు ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. శుక్రవారం పోలాకి మండలం మబగాంలో పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 30 రూపాయల నుండి నేడు నాలుగు వేల రూపాయల పెన్షన్ చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.