పలు కేసులలో రౌడీ షీటర్లుగా నమోదైన పలువురిని పోలీస్ స్టేషన్ కు రప్పించి, వారికి తగిన విధంగా అవగాహన కల్పించామని ఎస్సై జి. రంజిత్ తెలిపారు. ఆదివారం సాయంత్రం పోలాకి మండల పోలీస్ స్టేషన్ లో మండలంలో ఉన్న రౌడీషీటర్లను జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు స్టేషన్ కు రప్పించడం జరిగిందన్నారు. వారితో మాట్లాడుతూ భవిష్యత్తులో ఎటువంటి నేరాల జోలికి పోకూడదంటూ హెచ్చరించారు. ఎక్కడ ఏమి జరిగినా ముందుగా తమకు తెలియజేయాలని ఆదేశించారు.