పోలాకి మండలం రుంకుపేటలో భవనం పైనుండి జారిపడి ఇద్దరు పెయింటర్లకు తీవ్ర గాయాలయ్యాయి. కుసుమ పోలవలస గ్రామానికి చెందిన రువ్వ మణి, కింజరాపు శ్రీనివాసరావు అనే పెయింటర్లు బుధవారం రుంకుపేటలో భవనాలకు రంగులు వేస్తుండగా, సాయంత్రం పరంజ తాళ్లు తెగిపడడంతో కిందపడి గాయాలపాలయ్యారు. వీరిని వెంటనే నరసన్నపేట హాస్పిటల్ కు తరలించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం రిమ్స్ కు తరలించారు.