నరసన్నపేటలో వైసిపి మహిళా సంఘ సభ్యుల నిరసన ర్యాలీ

కృష్ణాజిల్లా జడ్పీ చైర్మన్ ఉప్పల హారికపై దాడి ఘటనపై వైసిపి మహిళా సంఘ సభ్యులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం సాయంత్రం నరసన్నపేట పట్టణంలో నియోజకవర్గ వైసిపి అధ్యక్షురాలు జీవీ రమణ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మహిళపై దాడులు చేస్తే సహించమని ఓటమి ప్రభుత్వం బూటకపు మాటలు వల్లిస్తుందని దుయ్యబట్టారు. ఆమెకు న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తామని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్