నరసన్నపేట ఆర్టీసీ కాంప్లెక్స్ లో వేసవిలో దాహార్తిని తీర్చేందుకు స్థానిక ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యం ఆర్వో ప్లాంట్ ను ఏర్పాటు చేసింది. శనివారం టిడిపి నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన ఈ ప్లాంట్ ను ప్రారంభించారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన కళాశాల కార్యదర్శి లక్ష్మి ప్రసన్నను ఆమె అభినందించారు. ఈ ప్లాంట్ కొనసాగేలా పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.