సారవకోట మండలం అవలంగి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ నీలమణి పాతపట్నం అమ్మవారి ఆలయంలో ఆషాడ గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులు విరివిగా పాల్గొని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు చల్లపల్లి భాస్కరరావు మాట్లాడుతూ అమ్మవారికి అన్న రాశి కార్యక్రమం కూడా చేపడుతున్నామని తెలియజేశారు.