సారవకోట మండలం కిష్టపురం వద్ద ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొనడంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం నరసన్నపేటలో జరిగే సదరం పరీక్షలకు వచ్చిన వీరు తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళ్తుండగా ఘటన జరిగింది. ఆటో డ్రైవర్ డి సంతోష్ తో పాటు, భారతి, తులసి కుమార్, పగడాలమ్మ, అమ్మనమ్మలు గాయాలపాలయ్యారు. వీరిలో అమ్మనమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు. కేసు నమోదు చేశామని ఎస్సై అశోక్ బాబు తెలిపారు.