ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని తహసిల్దార్ విజయలక్ష్మి తెలిపారు. శుక్రవారం సారవకోట మండలం సవరమాలువ, కురిడింగి, పప్పంగి రెవిన్యూ గ్రామాలలో సుమారు వందకు పైగా పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు అందజేశారు. మండలంలో ఏడు వేలకు పైగా రీ సర్వే చేసి పాస్ పుస్తకాలను పంపిణీ చేసేందుకు సిద్ధం చేశామని ఆమె పేర్కొన్నారు.