సారవకోట: అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు.. ఎమ్మెల్యే

కూటమి ప్రభుత్వ హయాంలో ఇల్లు లేని నిరుపేదలకు తప్పనిసరిగా గృహాలు మంజూరు చేసే దిశగా కృషి జరుగుతుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. సోమవారం సారవకోట మండలం చోడ సముద్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన గృహాలను ఆయన ప్రారంభించారు. ప్రతి ఒక్కరికీ ఇల్లు సమకూర్చేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్