సారవకోట మండలం బుడితి సామాజిక ఆసుపత్రిలో ఇటీవల మృతి చెందిన గర్భిణి బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పరామర్శించారు. శుక్రవారం స్థానిక ఆసుపత్రికి చేరుకున్న ఆయన ఇద్దరూ గర్భిణీలు మృతి చెందిన ఘటనపై స్థానిక వైద్య అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకునేందుకు ప్రభుత్వం నుండి కృషి చేస్తానని హామినిచ్చారు. ఆయనతో పాటు సమన్వయకర్త బగ్గు అర్చన పాల్గొన్నారు