సారవకోట: ప్రకృతి సేంద్రియ ఎరువులతో వ్యవసాయానికి మేలు

ప్రకృతి సేంద్రియ ఎరువులతో వ్యవసాయానికి మేలు జరుగుతుందని ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ తోట రమణ తెలిపారు. శుక్రవారం సారవకోట మండలం చీడిపూడి లో నిర్వహిస్తున్న శిక్షణా తరగతుల్లో భాగంగా పలు సేంద్రియ ఎరువుల తయారీ విధానాన్ని రైతులకు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ఈ ఎరువులతో భూమి కూడా సారవంతం అవుతుందని తద్వారా ఫల సాయం పెరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ సహాయ, ఉద్యానవన సహాయ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్