అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా ఇటీవల నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ఎంఈఓ ఎం వెంకటరమణ బహుమతులు అందజేశారు. బుధవారం సారవకోట మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, విభిన్న ప్రతిభావంతులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.