విద్యాశాఖ ఆదేశాల మేరకు, సారవకోట మండలం బుడితి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు సెలవు దినాలలో యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నట్లు హెచ్ఎం జి రాము తెలిపారు. ఆదివారం 130 మంది విద్యార్థులు స్టడీ అవర్స్ లో పాల్గొన్నారు. వీరికి మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేశారు. వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని విద్యను అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.