సారవకోట: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న వ్యాన్.. ఒకరు మృతి

సారవకోట మండలం పెద్దలంబ రహదారిలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బత్తిలి గణపతి (34) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. తెంబురు నుండి పెద్ద లంబ స్కూటీపై వస్తున్న గణపతిని ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఎస్సై అనిల్ కుమార్ తెలిపిన వివరాల మేరకు, కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్