సారవకోట: ఆటో ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి

సారవకోట మండలం కిట్టాలపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళితే గురువారం మధ్యాహ్నం ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొనడంతో ఐదుగురుకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని నరసన్నపేట ఏరియా హాస్పిటల్ కి తరలించి వైద్య సహాయం అందజేశారు. వీరిలో రంగాల అమ్మనమ్మ కు తీవ్ర గాయాలు కావడంతో శ్రీకాకుళం రిమ్స్ హాస్పటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది.

సంబంధిత పోస్ట్